రైతాంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలను ఎరువులు పురుగుమందులు ఉచితంగా ఇవ్వాలి

* కల్తీ విత్తనాలు, కల్తీ వ్యాపారస్తు ల ను అరికట్టాలి ఏ ఐ యూ కె ఎస్ ఆధ్వర్యంలో తల్లాడ తాసిల్దార్ కార్యాలయంలో యు డి సిగారికి వినతి పత్రం అందించడం జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 7, తల్లాడ రిపోర్టర్ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐ యు కె స్ ) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు కొండే వెంకటేశ్వర్లుమాట్లాడుతూ* నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ను మోడీ ప్రాణ గొప్పలు చెప్పుకుంటూ ప్రజల పైన పెనుబారాలు మోపుతున్నదని వారు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కరాల ధరలో నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని గ్రామీణ ప్రజల భూమి లేని వారికి భూమి ఇండ్లు లేని వారికి ఇల్లు ఉద్యోగ ఉపాధి ఇవ్వాలని ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలో చిన్న సన్నగార మరియు మధ్యతరగతి రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేయాలని వారు అన్నారు. రైతంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దుచేసి కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వ్యవసాయానికి అవసరమైన వనము సగం సబ్సిడీపై ఇవ్వాలని కనీస మద్దతు ధరలు నిర్ణయించి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విత్తనాలు పురుగుమందులను అరికట్టాలని కల్తీ విత్తన వ్యాపారులతో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అకాల వర్షాల కారణంగా నష్టపోయిన గంటలకు ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి యు సి ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు తల్లాడ బ్రాంచ్ కమిటీ అధ్యక్షులు పఠాన్ నాగుల మీరా ధరావత్ రమణ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *