జనం న్యూస్ జూన్ 7 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి బుక్య జాన్సన్ నాయక్ జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కార్యకర్తల మధ్య కేక్ ను కట్ చేయడం జరిగింది. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో డాక్టర్ దేవేందర్ రెడ్డి హాస్పిటల్ నిర్మల్ వారిచే మరియు ఎస్.ఎస్ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రధానం తరం పార్టీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలను కన్నుల పండుగ నిర్వహించి కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని బుక్య జాన్సన్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప గుచ్చం అందజేస్తూ శాలువాలతోసన్మానించడం జరిగింది.