గుర్తుతెలియన మృతదేహం లభ్యం.

జనం న్యూస్ జూన్ 7 కోటబొమ్మాళి మండలం :మండలం జాతీయ రహదారి చీపుర్లపాడు గ్రామసమీపంలోని శ్రీపురం కూరగాయల మార్కెట్ కు కూతవేటు దూరంలోని వంశదార ఎడమకాలువ ఎడమ గట్టు పై శనివారం సుమారు 35 నుంచి 40ఏళ్లు మధ్య గల వయసు కలిగిన గుర్తుతెలియని పురుషుని మృతదేహం తీవ్ర కలకలం రేపింది. శనివారం గొర్రెల కాపర్లు అటుగా వెల్లడంతో మృతదేహం చూసి గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ వి. సత్యన్నారాయణ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృ తదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం స్థానిక ప్రభుత్వ సామాజిక అసుపత్రికి తరలించారు. మృతుడు ముఖం పురుగులు పట్టి కుళ్ళిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని, కాఫీ రంగు రౌండ్ నెక్ టీషర్టు ధరించి, లైట్ కాపీకలర్ కాటన్ జీన్స్ ఫ్యాంట్ ధరించి నలుపు రంగు బెల్టుతో టచ్చేసి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు 6309990861, 6309990817 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని ఎస్.ఐ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *