పయనించే సూర్యుడు ) 9-జూన్ కొడంగల్ నియోజకవర్గం నిందితులపై హత్యా కేసు పెట్టాలి బీసీలపై దౌర్జన్యాలను అరికట్టాలి వికారాబాద్ జిల్లా కోడంగల్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు బోయిని వెంకటయ్య అడ్వకేట్ అధ్వర్యంలో సోమవారం కోడంగల్ ఎమ్మార్వో కి మెమోరండం అందజేసిన ప్రజాసంఘాల నాయకులు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తలారి హరికృష్ణ సన్నాఫ్ టి.నర్సిములు , జిల్లా వికారాబాద్, మండలం బషీరాబాద్, జీవన్గి గ్రామానికి చెందిన యువకుడు పని నిమిత్తమై 29-4-2026 రుద్రారం గ్రామానికి వెళ్ళాగా అదేరోజు మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన గురించి పోలీసులకు తెలియజేయగా వారు సంఘటన స్థలానికి ఆలస్యంగా రావడమే కాక ఆధారాలు వివరాలు సేకరించడంలో విపలమవ్వడమే గాక కేసు పురోగతి విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉంటూ నిందితులను కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారు. కావును బాధితులకు న్యాయం జరిగే వరకూ ముదిరాజ్ సంఘాల సహాకారంతో ప్రజాసంఘాలు పోరాటం చేస్తామని తెలిపారు. ఎమ్మార్వో గారిని కలిసిన వారిలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య,ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూర వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బాలప్ప, దౌల్తాబాద్ వెంకటప్ప,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అన్నారం సాయిలు, వెంకట్ రాములు ముదిరాజ్, తాండూరు మండల అధ్యక్షులు రమేష్, బీసీ సంఘం అధ్యక్షులు బసంత్,మూడ నమ్మకాల నిర్ములన కమిటీ సభ్యులు జుంటుపల్లి అంజి, జయప్రసాద్, శానప్ప, నర్సింహులు, మైపాల్, అశోక్, శ్రీనివాస్, నవీన్, లలిత తదితరులు పాల్గొన్నారు