గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో

* ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి విద్యార్థి విద్యార్థులకు ఘన సన్మానం * కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు రాలు గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు జూన్ 9 ఆదోని రూరల్ రిపోర్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిసె ఆది కృష్ణమ్మ హాజరై విద్యార్థులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదివి అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నిరూపించారని కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యారంగంలో రాణించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు సాధించిన విజయాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విద్యే పునాది అని, ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఉమ్మి సలీం, ఆరెకల్ రామకృష్ణ, విట్ట రమేష్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, గోపాల్ రెడ్డి, గుడిసె శ్రీరాములు, మధుసూదన్ శర్మ, సోమశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మనోరయ్య, వాల్మీకి సంఘం నాయకుడు రామ్ భీం నాయుడు, మాజీ ఎంపీపీ మురళి, బసాపురం రామస్వామి, బుద్ధారెడ్డి, బజారప్ప, గనేకల్ మల్లయ్య, కల్లుబావి మల్లికార్జున, రాఘవరెడ్డి, బాబురావు, భరత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గుడిసె కృష్ణమ్మ సేవా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాలు ఆదోని నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొంటూ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *