రాజ్యసభకు సానా సతీష్ బాబు ఎంపిక హర్షనీయం..అడబాల..

పయనించే సూర్యుడు జూన్ 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రాజ్యసభ సభ్యుడిగా ఏడాదిన్నర మాత్రమే కొనసాగిన సానా సతీష్ బాబు మరల ఎంపిక కావడం ఆయన సమర్థతకు నిదర్శనమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు తాను నిరూపించుకుని సమర్థతను చాటారని అన్నారు. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న వేళ ఇంచుమించు అన్ని రోజులలో ఏదో ఒక సమస్యను లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కాకినాడలో ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను దిగ్విజయంగా నిర్వహిస్తూ. . ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఆ వేదిక ద్వారా పరిష్కరించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీలో స్వయంకృషితో, సమర్ధతతో కీలకమైన వ్యక్తిగా ఆయన పార్టీకి సేవలు అందిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించే అవకాశం లభించినందున మరిన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం లభించనుందని అన్నారు. కాకినాడ నగరానికి విద్య, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరగడంతో తాకిడి ఎక్కువైనా ఆ స్థాయిలో మౌలిక వసతులు సరిపోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని సదుపాయాలతో నగర రూపురేఖలు మార్చడానికి గాను కేంద్ర ప్రభుత్వం నుండి అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద నిధులు సాధించాలని అన్నారు. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఏసియన్ ఇన్ఫ్రాక్టెక్చర్ బ్యాంకు అమృత పథకం ద్వారా నిధులు సమకూర్చడానికి సానా సతీష్ కృషి చేసి నగర అభివృద్ధికి తోడ్పడాలని అడబాల కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *