హున్సా తగ్గెల్లి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాపై నిఘా…

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 సాలూర:సాలూర మండలంలోని హున్స తగ్గెల్లి గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ నవాజ్ అప్రమత్తమయ్యారు అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇసుక పాయింట్లు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *