పయనించే సూర్యుడు జూన్ 13 రాజేష్) దౌల్తాబాద్ లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ 5 వ వార్షికోత్సవ సమావేశానికి హాజరైన నాబార్డ్ డిడీఎం అఖిల్, డిపిఎం వాసుదేవ్ దౌల్తాబాద్: ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ 5 వ వార్షికోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నాబార్డ్ డిడిఎం అఖిల్ దౌల్తాబాద్, రైతుల ఆదాయ వృద్ధి, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల (ఎఫ్‌పీసీ) ద్వారా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నాబార్డ్ డీడీఎం అఖిల్ తెలిపారు. శుక్రవారం దౌల్తాబాద్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ 5వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దౌల్తాబాద్ ఎఫ్‌పీసీకి ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రూ.37 లక్షల గ్రాంట్ మంజూరైనట్లు వెల్లడించారు. డీపీఎం వాసుదేవ్ మాట్లాడుతూ రైతులు ఆయిల్‌పామ్, కూరగాయలు, పప్పుధాన్యాల వంటి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. దౌల్తాబాద్ ఎఫ్‌పీసీ 46 గ్రామాలకు సేవలు విస్తరించి రూ.2.33 కోట్ల టర్నోవర్‌తో రైతులకు సేవలందిస్తోందన్నారు. ఏపీఎం మహిపాల్ మాట్లాడుతూ ఎఫ్‌పీసీ ఆధ్వర్యంలో క్యాటిల్ ఫీడ్ మిక్సింగ్, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎఫ్‌పీసీ చైర్‌పర్సన్ నర్రా కనకలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ నాగమణి, సీఈఓ కనకరాజు, వాటాదారులు పాల్గొన్నారు.