నాయకత్వ పటిమ.. మానవత్వపు చేయూత.. వత్సవాయి టిడిపి ఆదర్శం …

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 వత్సవాయి మండలంలో తెలుగుదేశం పార్టీని అగ్రపథాన నడిపిస్తూ, ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండే మన మండల పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు సమర్థవంతమైన నాయకత్వంలో మండల ఉపాధ్యక్షులు, సేవా హృదయులు దారెల్లి చిరంజీవి గారు ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు… వత్సవాయి గ్రామానికి చెందిన ఆలేటి పద్మ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు, ఆమె స్వయం ఉపాధి కోసం దారెల్లి చిరంజీవి పెద్ద మనసుతో ఒక గాజుల బండిని బహూకరించడం జరిగింది.. ఈ ఉపాధి రథాన్ని, పార్టీ క్యాడర్‌కు ఎల్లప్పుడూ కొండంత అండగా నిలిచే మన ప్రియతమ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు * తన అమృత హస్తాలతో రిబ్బన్ కట్ చేసి, ఘనంగా ప్రారంభించి పద్మ కి మరియు *చిరంజీవి కి తన ఆశీస్సులు, అభినందనలు అందజేశారు… మండలాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అధ్యక్షుడు రాంబాబు కి, పేద కుటుంబానికి ఉపాధి కల్పించిన ఉపాధ్యక్షుడు చిరంజీవి కి హృదయపూర్వక ధన్యవాదాలు.. ఈ కార్యక్రమం లో మండల సమైక్య అధ్యక్షురాలు సాగర్ల కృష్ణవేణి, వత్సవాయి గ్రామ పార్టీ అధ్యక్షులు కనతల రామకృష్ణ,ఆళ్ళురుపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు నారపోగు కొండ, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కాకాని బాలకృష్ణ, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *