రసూల్ ను పరామర్శించిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు ..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 16, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రసూల్ గత కొంతకాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతూ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఆయన గృహం నందు విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రసూల్ గృహానికి చేరుకొని పరామర్శించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పాటించవలసిన నియమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, నాయకులు మారెళ్ళ దేవేందర్,తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, చీకటి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు రసూల్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *