ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ వి.శేఖర్ కు ఆత్మీయ సన్మానం.

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధన ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో విభాగ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ వి.శేఖర్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో గాంధీ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. ఆర్థోపెడిక్ విభాగంలో డాక్టర్ వి. శేఖర్ గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో ఆర్థోపెడిక్ విభాగంలో విశిష్ట సేవలందించి, సాధారణ, క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విశేషంగా సేవలను పెంచారు. గతంలో తక్కువ మోతాదులో చేసే శస్త్ర చికిత్సలు నేడు కార్పొరేట్ స్థాయి విధంగా 60 పైన క్లిష్టమైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు. ఓపి విభాగంలో వందలాది మంది ప్రతిరోజూ సేవలు పొందుతున్నారు. ఆర్థోపెడిక్ వైద్యుల సంయుక్త కార్యాచరణతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించుటలో తనదైన శైలిలో పాత్ర వహించారు. ఈ జిల్లా నుండి క్లిష్టమైన శస్త్ర చికిత్సలకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి విజయ సేవలు అందిస్తానని ఆయన అన్నారు.ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ వెంకటరెడ్డి,డాక్టర్ ఏ.మహేష్,డాక్టర్ షఫీ,డాక్టర్ గౌతమి,ఆర్ఎంఓ డాక్టర్ రోహిత్,నర్సింగ్ సూపర్డెంట్ మంజుల,హెడ్ నర్స్ మంజుల,పద్మ,ఇతర వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆంజనేయులు, ఆరోగ్య సిబ్బంది, సానిటరీ సిబ్బంది, పూలమాలలు, మెమొంటోళ్లు ,శాలువాలతో ఘనంగా సన్మానించరు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారి ఎం ఆనంద్,హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి,నర్సింగ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు జానకి దేవి, ఆరోగ్య సిబ్బంది సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *