పయనించే సూర్యుడు… న్యూస్.. మే..24. నేలకొండపల్లి టౌన్ లో ఇటీవల మృతి చెందిన 38 కుటుంబాలకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో PSR ట్రస్ట్ ద్వారా 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా అందించారు.మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేద ప్రజల కష్టాలు తెలిసిన మనిషని అటు ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేస్తూ ఇటు తన PSR ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడాలి గోవింద రావు,మహిళా కాంగ్రెస్ నాయకురాలు పసుపులేటి శ్రీలత, కుక్కల హనుమంతరావు,బొడ్డు బొందయ్య,మైసా శంకర్, మామిడి వెంకన్న, జెర్రిపోతుల అంజని,నంబురి రామారావు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, పసుపులేటి ఉపేందర్ కూరాకుల నాగేశ్వరరావు ,తోట వాసు, కొడిరెక్క వినోద్, రోహిత్,వాకా శ్రీనాద్,మన్నే నరేష్,జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు