కొత్త ఇంచార్జి మధుసూదన శర్మను ఘనముగా సన్మానం చేసి బిజెపి నాయకులు..

పయనించే సూర్యుడు జులై 9 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఇటీవల సాదాపురం మండలానికి భారతీయ జనతా పార్టీ నూతన ఇంచార్జీగా నియామకం పొందిన వెల్లాల మధుసూధనశర్మ ను బిజెపి శ్రేణులు ఘనముగా సన్మానం చేసారు. తిరుమల నగర్ శ్రీనివాస కళ్యాణ మంటపములో సాదాపురం మండల బిజెపి అధ్యక్షుడు బి.ఉషారాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీలోని ప్రధాన కార్యదర్శి కోసిగయ్య తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్ మరియు వివిధ మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మధుసూదన శర్మ మాట్లాడుతూ నాపైన నమ్మకం ఉంచి సాదాపురం మండలానికి ఇంచార్జీగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు పివిన్ మాధవ్ కి, కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణకి,మరీ ముఖ్యంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని అలాగే అధ్యక్షుడు ఉషారాజు ప్రధాన కార్యదర్శి కోసిగయ్య తో కలిసి సాదాపురం మండలములో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికోసం కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో లోను భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడేలే నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చెయ్యాలని అందుకు తగిన ప్రణాలికలు సిద్ధం చేసుకుంటామని మధుసూదన శర్మ తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమములో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నానని మధుసూధనశర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *