పయనించే సూర్యుడు: జూలై: 9/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు పెనుబల్లి మండలం, మండాలపాడు గ్రామ పంచాయతీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండాలపాడు గ్రామ సర్పంచ్ గాయం రమేష్ ఆధ్వర్యంలో పంచాయతీ ప్రధాన రహదారిలోని వైఎస్సార్ విగ్రహంతో పాటు పెద్దూరులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజాహిత పాలన, పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, సమాజానికి అందించిన విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కిశోర్ పోతురాజు, కాంగ్రెస్ నాయకులు, వార్డ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
.
