తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ (ధార్మిక సెల్) నూతన కార్యవర్గ సమావేశం

పయనించే సూర్యుడు జూలై 9 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్నవజ్జుల సూర్య ప్రకాష్ అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర బిజెపి రథసారథి నరపరాజు రామచంద్ర రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశం కోసం దేశాభివృద్ధి కోసం ముఖ్యంగా ఎండోమెంట్ సెల్ ద్వారా దేవాలయం పరిరక్షణ కోసం పాటుపడాలని, గ్రామ గ్రామాన అభివృద్ధి చేయాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి తప్పక వస్తుందనీ ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్, ఎండోమెంట్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ శ్రీమతి వనం సుజాత, రాష్ట్ర అడ్వైజర్ దడిగం సుధాకర్ శర్మ , నాయకులు మరియు వివిధ జిల్లాల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొని, సందర్భంగా బిజెపి రాష్ట్ర రథసారథి శ్రీ నరపరాజు రామచంద్ర రావు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షులు ఒక సంవత్సరం పరిపాలన విజయవంతంగా నడిపించినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *