పయనించే సూర్యుడు జూలై 9 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలనగర్ మండల కేంద్రంలోని పెద్దాయపల్లి చౌరస్తా లో దళిత ఉద్యమ సూర్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు మాదిగ మరియు మాదిగ ఉపకులాల పక్షాన ఘనంగా నిర్వహించారు దళిత జాతి అభ్యున్నతికి భవిష్యత్తు ఆలోచనలతో గత 32 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ దళిత జాతిలో పుట్టడం జాతి చేసుకున్న అదృష్టమని , అనంతరం పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆలోచనలో ధైర్యం లో మందకృష్ణ మాదిగ అభినవ అంబేద్కర్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రేవల్లి కృష్ణ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శేఖర్ తదితర నాయకులు దళిత జాతి బిడ్డలు మాదిగ ఉప కులాల నాయకులు పాల్గొన్నారు.