బిఆర్ఎస్ నాయకుడి మాతృమూర్తి మృతికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

పయనించే సూర్యడు జూలై 09 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బోళ్ళ వెంకటరామిరెడ్డి మాతృమూర్తి అనసూర్యమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ వెంటనే గ్రామానికి చేరుకున్నారు. మరణించిన అనసూర్యమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన బొల్లం మల్లయ్య యాదవ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు గారుపాటి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నీలకంఠ వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు మరియు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *