పయనించే సూర్యుడు జూలై 09 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీ కే అరుణమ్మ బుధవారం రంగారెడ్డి గూడ గ్రామంలో పర్యటించారు. గ్రామ సర్పంచ్ కాటేపాగ రేవతి ఆనంద్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎంపీ డీకే అరుణమ్మ వారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేవతి ఆనంద్ దంపతులు ఎంపీ గారికి ఘన స్వాగతం పలికారు.అనంతరం గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై ఎంపీ డీకే అరుణతో సర్పంచ్ చర్చించారు. గ్రామానికి అత్యవసరమైన కొత్త అంగన్‌వాడీ భవనం నిర్మాణం, గ్రామ వీధుల్లో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు, మురికివాడలు, ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం ,యువత, విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయం (లైబ్రరీ) ఏర్పాటు కల్పించాలని ఈ సందర్భంగా ఎంపీ గారికి వినతిపత్రం సమర్పించారు.సర్పంచ్ రేవతి ఆనంద్ కోరిన సమస్యలపై ఎంపీ డీకే అరుణమ్మ గారు సానుకూలంగా స్పందించారు. గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, నిధుల మంజూరుకు కృషి చేసి రంగారెడ్డిగూడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.