పయనించే సూర్యుడు జూలై 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) విద్యుత్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని విద్యుత్ తనిఖీ అధికారి పి.బాలకృష్ణ పేర్కొన్నారు. కోరమండల్ ఎరువుల కర్మాగారంలో నిర్వహించిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధానంగా కర్మాగారంలో పనిచేసే సిబ్బంది విద్యుత్ భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కోరమండల్ కర్మాగారంలో పాటిస్తున్న విద్యుత్ భద్రతా విధానాలను కొనియాడారు. మెయింటెనెన్స్ హెడ్ కమల్ కుమార్ మాట్లాడుతూ కర్మాగారంలో అమలు చేస్తున్న విద్యుత్ భద్రతా ప్రమాణాల విధానాలను సిబ్బందికి వివరించారు. కాకినాడ కోరమండల్ యూనిట్ హెడ్ జగన్నాథన్ మాట్లాడుతూ పరిశ్రమల్లో విద్యుత్ ఆవశ్యకత గృహంలో విద్యుత్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అనంతరం ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ నూకరాజు మాట్లాడుతూ పరిశ్రమలో విద్యుత్ భద్రతా విధానాన్ని కొనియాడారు.హెచ్ ఆర్ పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలని కోరారు.అనంతరం విద్యుత్ భద్రతపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించిన ఉద్యోగులకు మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ హెడ్ గంగాధర్, ఇంజనీర్లు సుబ్బరాజు, వివేక్,సిద్దార్ధ,శ్రీనివాసకుమార్ వెంకటదుర్గ,వెంకటరాయలు, రామరాజు ఫ్యాక్టరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలి విద్యుత్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని విద్యుత్ తనిఖీ అధికారి పి.బాలకృష్ణ పేర్కొన్నారు. కోరమండల్ ఎరువుల కర్మాగారంలో నిర్వహించిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధానంగా కర్మాగారంలో పనిచేసే సిబ్బంది విద్యుత్ భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కోరమండల్ కర్మాగారంలో పాటి స్తున్న విద్యుత్ భద్రతా విధానాలను కొనియాడారు. మెయింటెనెన్స్ హెడ్ కమల్ కుమార్ మాట్లాడుతూ కర్మాగారంలో అమలు చేస్తున్న విద్యుత్ భద్రతా ప్రమాణాల విధానాలను సిబ్బందికి వివరించారు. కాకినాడ కోరమండల్ యూనిట్ హెడ్ జగన్నాథన్ మాట్లాడుతూ పరిశ్రమల్లో విద్యుత్ ఆవశ్యకత గృహంలో విద్యుత్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అనంతరం ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ నూకరాజు మాట్లాడుతూ పరిశ్రమలో విద్యుత్ భద్రతా విధానాన్ని కొనియాడారు.హెచ్ ఆర్ పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలని కోరారు.అనంతరం విద్యుత్ భద్రతపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించిన ఉద్యోగులకు మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ హెడ్ గంగాధర్, ఇంజనీర్లు సుబ్బరాజు, వివేక్, సిద్దార్ధ, శ్రీనివాసకుమార్ వెంకటదుర్గ, వెంకటరాయలు, రామరాజు ఫ్యాక్టరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు