ఘనంగా మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు.

పయనించి సూర్యుడు జూలై 9 తొర్రూర్ మండలం రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి రవీంద్రచారి పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ జిల్లా నాయకులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *