
పయనించే సూర్యుడు జూలై 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రజాహృదయ నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా. మండల కేంద్రమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో చేజర్ల జడ్పిటిసి సభ్యులు పీర్ల పార్థసారథి . పాల్గొని, వైఎస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు మరియు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను, ప్రజాసేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానేత. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్సిపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు