పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 5 చిన్నారుల సంపూర్ణ అభివృద్ధి కోసం అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గూడూరు సీడీపీవో మెహబూబి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీడీపీవో మెహబూబి మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్స్ బదులు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది అనే నినాదాన్ని ఇచ్చారు. పోషకాహారం మరియు ప్రీ-స్కూల్ విద్య ప్రతి చిన్నారి హక్కు అని పేర్కొన్నారు. ఏసీడీపీవో శారద , సూపర్వైజర్ చెంచు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయుడు కాలువకట్ట అంగన్వాడి కార్యకర్తలు కనకదుర్గ , భవాని పాల్గొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.