అగ్నిప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన

మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు

పయనించే సూర్యుడు న్యూస్ జులై 8 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామం ఈ రోజు అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాకనాటి పోలయ్య పూరి ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయ సహకారాలు అందేలా జారే ఆదినారాయణ అధికారులతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *