అన్నారుగూడెంలో ముగిసిన గ్రామసభ ..

* పరస్పర సహకారమే పల్లె ప్రగతికి సోపానాలు... * అన్ని శాఖలు అప్రమత్తంగా పని చేయాలి అభివృద్ధిని చాటాలి .. * సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ కెవి సంయుక్త ప్రకటన ..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 7,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అధ్యక్షతన శనివారం ఉదయం పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరం నందు గ్రామసభ నిర్వహించారు.గ్రామ పాలకవర్గాల 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఈ సభ జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్.గతంలో జరిగిన వివిధ శాఖల ప్రగతి నివేదిక,రాబోవు రోజుల్లో చేపట్టిపోయే పనుల యొక్క అంశాలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పంచాయితీ పనితీరు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని.ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి అంకితభావంతో పనిచేయాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని. పంచాయతీ ప్రధాన ఉద్దేశం ప్రజా యోగక్షేమాలేనని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ స్పెషల్ ఆఫీసర్ మండల వ్యవసాయ అధికారి షేక్ తాజుద్దీన్, ఎస్సై బానోతు వెంకటేష్,పంచాయతీ సెక్రెటరీ కె.వెంకటేశ్వర్లు, అన్ని వార్డుల వార్డ్ సభ్యులు,బిఆర్ఎస్ నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,బిజెపి మండల నాయకులు ఆపతి వెంకట రామారావు, పంచాయతీ బోర్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బొమ్మగాని నాదం, పులి వెంకట నరసయ్య,నాయకులు మారెళ్ళ దేవేందర్, గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్),పొన్నం కృష్ణయ్య,మాజీ ప్రజా ప్రతినిధులు,విద్యా, వైద్యా,ఆరోగ్య,మహిళ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ ఫారెస్ట్,ఐకెపి,ఈజీఎస్ అన్ని విభాగాల సహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *