పయనించే సూర్యుడు న్యూస్ :మే 21,తల్లాడ రిపోర్టర్ తన సుదీర్ఘ కాలమంతా ప్రజాసేవకే అంకితం చేసిన నాయకుడు, గ్రామ అభ్యున్నతే తన జీవిత ఆశయంగా భావించి నిరంతరం పేదల పక్షాన పోరాడిన కమ్యూనిస్టు యోధుడు అమరజీవి కామ్రేడ్ దొడ్డ నారాయణ అని సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అన్నారుగూడెం గ్రామ ప్రధాన సెంటర్లో అమరజీవి దొడ్డ నారాయణ 41 వ వర్ధంతి వేడుకలు బుధవారం ఉదయం బి.ఆర్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ దొడ్డ నారాయణ కుటుంబం గ్రామానికి,గ్రామ ప్రజల అభ్యున్నతికి ఒక జవానుల పనిచేశారని అన్నారు.సంపూర్ణ గ్రామాభివృద్దె ద్యేయంగా తన సుదీర్ఘకాలానంత ప్రజా జీవితానికి అంకితం చేసిన మహనీయుడని ఆ మహనీయుని ఆశయ సాధనలోనే ఆయన తనయుడు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అడుగులు వేస్తూ, కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గ్రామ శ్రేయస్సులో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. తొలుత సర్పంచ్ ప్రభాకర్ దొడ్డ నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మరి కొంతమంది ముఖ్యులు నారాయణ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,ఆ పార్టీ సీనియర్ నాయకులు సుంకర రోశయ్య, నాయకులు మారెళ్ళ దేవేందర్, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, నున్నా వెంకటేశ్వర్లు, పేరసాని నరసింహారావు,మాజీ వార్డ్ మెంబర్ సైదా, తాళ్లూరి బుల్లి రాములు, ముచ్చింతల నరసింహారావు, సుంకర రాజారావు, గోన వేలాద్రి, సుంకర శ్రీనివాసరావు, షేక్ జానీ, ఇస్నపల్లి శ్రీనివాసరావు, అమర్లపూడి భవాని, గొడ్ల యేసురత్నం, ఇస్నపల్లి నరసింహారావు, ఎలగందుల సురేష్, ఇస్నపల్లి చిన్నకృష్ణ, నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు