పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /09:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రం లోని అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మీ ఉద్యోగాలు సాదించిన యువకులకు ఘణ సన్మాణం. అలయన్స్ అధ్యక్షులు బండారి నరసయ్య, మాట్లాడుతూ. పట్టుదల క్రమశిక్షణతో చదివి నమ్ముకున్న కస్తాన్ని వమ్ముచేయకుండా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అన్న తమ్ముళ్లు ఓదెల అనంద్ మరియు శివవీరిద్దరూ పట్టుదలతో క్రమశిక్షణ తో చదివిన వీరు ఉద్యోగం పొందుటకు పేదరికం అడ్డుకాదు అని నిరూపించారు. అని తల్లిదండ్రులు ఓదెల లక్ష్మణ్ అనిత రోజు కుట్టు మిషన్ తొక్కితే కానీ పూట గడవని కుటుంబం అలాంటి కుటుంబంలో జన్మించిన అన్న తమ్ముళ్లు చిన్నప్పటినుండి కష్టం అంటే ఏంటో కళ్ళారా చూస్తూ చదువులో రాణిస్తూనే ఈమధ్య నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే పట్టుదలనే నమ్ముకుని రేయింబవళ్లు కష్టపడి చదివి అగ్నివీర్ ఆర్మీ ఉద్యోగాలు సంపాదించడం ఆ కుటుంబానికి ఎంతో గర్వకారణం అని యువత చెడు మార్గం వైపు మత్తు గాంజాయ్. ఆన్లైన్ గేమ్స్ వైపు పయనించ కుండా ఉన్న సమయాన్ని చక్కగా ప్రణాళికతో చదువు. ఉద్యోగం కుటుంబం పై దృష్టి పెట్టి చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని. గ్రామ యువకులు వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కునబోయిన బాలరాజు. కోశాధికారి సత్యనారాయణ గౌడ్, పిఆర్ఓ రాజ ఎల్లయ్య మీడియా సెల్ దయ్యాల సురేష్. పర్ష ఐలయ్య. కోహెడ భాస్కర్ గౌడ్.మొగిళ్ళ బాబు. అంతటి తిరుపతి. మహేష్ దినేష్.మేకల ఐలయ్య. సతీష్ రమణారెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.