అశ్వారావుపేటలో లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

లక్ష రూపాయల ఎలిసి చెక్కు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్ మే 25 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు చేతుల మీదుగా నూతన ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం అశ్వారావుపేట, లోకల్ గైడ్ : స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్ఆర్ నగర్ 10వ వార్డు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. చాలా సంవత్సరాలుగా స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న లో వోల్టేజ్ లభించింది. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదివారం ఇక్కడ 100 కేవీ నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారుఈ సందర్భంగా వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. కాలనీవాసుల సుదీర్ఘకాలపు విద్యుత్ సమస్యను గుర్తించి, తక్షణమే స్పందించి నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మిండా హరిబాబు పాల్గొని మాట్లాడుతూ నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో కాలనీలో విద్యుత్ సమస్యలు తొలిగిపోతాయని హర్షం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఎల్ఎసి చెక్కు అందజేతమరోవైపు, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్థానిక నివాసి పత్తిపాటి కామేశ్వరావు కుటుంబానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పెద్ద దిక్కుగా నిలిచారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.1 లక్ష విలువైన ఎల్ ఓ సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు బాధితుడికి అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న ఎమ్మెల్యేకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.? ఘనంగా జరిగిన కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, విద్యుత్ శాఖ ఏఈ వెంకట్, లైన్మెన్ రామ్ కుమార్, జూనియర్ లైన్మెన్ పాషా, నాయకులు, కార్యకర్తలు దయాకర్, కరుణ, బాలాజీ, మస్తాన్, రాజ్ కుమార్, రాంబాబు, హుస్సేన్, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ లతో పాటు ఏఎస్ఆర్ కాలనీ స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *