ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మిద్దె రాములు మండల అధికారులు

పయనించే సూర్యుడు జూన్ 2 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లను సక్రమంగా వినియోగించుకుని కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో కథలప్ప, ఎమ్మార్వో మునీరుద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సర్పంచ్ మిద్దె ఇంద్ర రాములు, హౌసింగ్ ఏఈ అంజలి రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నసీర్, ముక్తార్, తిరుపతయ్య తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *