పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /12:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రజలకు 500 లీటర్ల చల్లని మజ్జిగ పంపిణి చేస్తున్న బెంద్రం.తిరుపతి రెడ్డి, ఇల్లంతకుంట మండలనికి వచ్చే వేలాది మంది ప్రజలకు ఎండ తీవ్రత నుండీ సాంత్వన కలిగించేందుకు చల్లని ఉచిత మజ్జిగ బెటర్ ( బెంద్రం తిరుపతి రెడ్డి) ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న బెంద్రం.తిరుపతి రెడ్డి మండల యువజన సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ.., ఇల్లంతకుంట మండలంలో 16 సంవత్సరాల నుండి ప్రతి వేసవి కాలంలో 100 రోజుల పాటు ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకు సమస్త ప్రజలకు మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేసీ ప్రజల దప్పిక తీరుస్తూ, ప్రతి గురువారము 500 లీటర్ల చల్లని మజ్జిగ కూడా ప్రజలకూ ఉచితముగా పంపిణి చేస్తున్నామన్నారు, ఈ పుణ్య సేవాలో ఫౌండేషన్ సేవా ప్రతినిదులు. గుగ్గిళ్ళ ఆంజనేయులు , గొడుగు రాకేశ్ , బాంగోని. శ్రీనివాస, ప్రయాణికులు , తదితరు ప్రజలు పాలుగోన్నారు.