పయనించే సూర్యుడు,జూన్ 16 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ప్రజా భవన్ నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు మరియు శ్రేయోభిలాషుల తరపున అస్మా ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు. అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.