ఎన్‌ఐటీ వరంగల్‌లో డాక్టరేట్‌ సాధించిన చెంగల్ యువకుడు పులి రజనీకాంత్

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల్ ప్రతినిధి కొత్పాల లింబాద్రి నిజామాబాద్ జిల్లా, చెంగల్ గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు పులి రజనీకాంత్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్ ) వరంగల్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి డాక్టరేట్‌ ( పీహెచ్డీ.) పట్టాను విజయవంతంగా పొందారు. ఆయన “మోడీఫైడ్ డైరెక్ట్ తొరక్యూ అండ్ మోడల్ ప్రిడిక్టీవ్ కరెంట్ కాంట్రోల్ స్కీమస్ ఫర్ ఫైవ్ ఫేస్ పెర్మనెంట్ మ్యాగ్నెట్ సించారోనాస్ మోటార్ డ్రైవ్ ” అనే అంశంపై పరిశోధన నిర్వహించి ఈ ప్రతిష్ఠాత్మక పట్టాను సాధించారు. పరిశోధన రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రజనీకాంత్, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఐయి జర్నల్స్‌లో రెండు పరిశోధనా పత్రాలను ప్రచురించగా, రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించి ప్రచురించారు. అదనంగా, తన పరిశోధన ఫలితాలకు సంబంధించిన రెండు పేటెంట్లను దాఖలు చేశారు. ఈ పరిశోధనను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రముఖ అధ్యాపకులు డా. టి. వినయ్ కుమార్ గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు. డాక్టరేట్‌ పూర్తి చేసిన అనంతరం రజనీకాంత్‌కు ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ *నెక్స్టియర్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సిస్టమ్ కంట్రోల్ ఇంజనీర్‌గా పనిచేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, తన పరిశోధన విజయానికి మార్గనిర్దేశం చేసిన పరిశోధనా పర్యవేక్షకులు డా. టి. వినయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన విద్యా ప్రస్థానంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు *పులి గంగాధర్, పులి గంగామణి గార్లకు, అలాగే సోదరుడు పులి శ్రీకాంత్ అందించిన సహకారం, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చెంగల్ గ్రామానికి చెందిన యువకుడు డాక్టరేట్‌ పట్టా సాధించి, అనంతరం ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశాన్ని పొందడం పట్ల గ్రామస్తులు, బంధుమిత్రులు, అధ్యాపకులు మరియు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనవిజయం చెంగల్ గ్రామానికి, నిజామాబాద్ జిల్లాకు మరియు ఆయన కుటుంబానికి గర్వకారణమని పేర్కొంటూ రజనీకాంత్‌కు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *