ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నెలా ఇంటి వద్దకే పెన్షన్ అందించడం ద్వారా లబ్ధిదారులకు ఎంతో సౌలభ్యం కలుగుతోందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తమ బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ పి టి పి సి చైర్మన్ వజ్జ బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, బీసీ సెల్ అధ్యక్షుడు లోడగల కామేష్, మున్సిపాలిటీ పరిధి అధ్యక్ష కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *