ఎస్ఐఆర్ నిర్వహణ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకునేలా ఉండాలి…. పరకాల ప్రభాకర్…రాజకీయ దురుద్దేశంతో ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఉద్యమిస్తాం…. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 12 పెనుగంచిప్రోలు, గ్రామంలోని ఈ రోజున ప్రత్యేక ఓటర్ సవరణ (సర్)పీ. ద్వారా అధికార పార్టీలకు మేలు జరిగేలా మాత్రమే నిర్వహణ చేస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు గురువారం స్థానిక స్నేహ గార్డెన్ నందు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట్ర రాజకీయ సై ద్దాం తిక శిక్షణ శిబిరం నందు సర్ నిర్వహణ పై ఉన్న భిన్న అభిప్రాయాల గురించి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనెపూడి శంకర్ తో కలిసి ఆయన విశ్లేషించారు ముందుగా రాజకీయ విశ్లేషణ సభలో ఆయన ఉపన్యసించారు సర్ విధివిధానాలపై ప్రజలకు ఉన్న ఆయన దృష్టికి వచ్చిన పలు అంశాల గురించి ఈ విశ్లేషణలో ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చనిపోయిన వారిని ఇక్కడ లేని అటువంటి వారిని ఓటు అనర్హులను తీసేస్తాము అని అధికార పార్టీ వారు సర్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారని కానీ అక్కడ చెప్పిన విధంగా ఆ నిర్వహణ కార్యక్రమం జరగటం లేదని ఇప్పటివరకు పది (మూడు కేంద్రపాలిత ప్రాంతాల) తో కలిసి రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమంలో సుమారు ఆరు కోట్ల 50 లక్షల మంది ఓట్లను తొలగించినట్లుగా ఆయన తెలిపారు 16 కోట్ల మంది మాత్రమే పది రాష్ట్రాల్లో అర్హులుగా చూపెట్టారని పేర్కొన్నారు తీసివేసిన ఓటర్లు చనిపోయిన వారు కానీ విదేశాలలో ఉన్నవారు కానీ లేక ఓటు అర్హత లేని వారుగా కానీ ఎక్కడ వివరాలు చూపలేదని పేర్కొన్నారు ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో కూడా ఇదే తంతు నడిస్తే స్థానిక పార్టీలు దాన్నే నిలుపుదల చేయలేని పక్షంలో సవరణలు కొరకు పోరాటాలు చేయవచ్చని ఆయన తెలిపారు కేంద్ర అధికార పార్టీలు ఎస్ఐఆర్ను ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారు ఆ ఉద్దేశం జరగకుండా కూడా రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు పోరాటాలు చేయవచ్చని పేర్కొన్నారు,గతంలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో ఒక్కొక్క డోర్ నెంబర్ పై 500 మంది 800 మంది ఉన్నట్లుగా చూపెట్టారని వారందరినీ తొలగించినట్లుగా చూపించారని పేర్కొన్నారు, కానీ అక్కడ ఆ డోర్ నెంబర్ లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు ఎస్ ఐ ఆర్ పరిశీలన క్రమంలో స్థానిక వార్డు లేక పంచాయతీలలో ప్రత్యేక సభలు నిర్వహించి ఎస్ఐఆర్లో చూపిన అంశాల ప్రకారం నిర్వహణ చేయాలని సూచించారు ఆ సభలో పాల్గొన్న పలువురి సూచనలను కూడా తీసుకొని ఓటర్ చేర్పులు మార్పులు పారదర్శకంగా చేయవచ్చని దాని ద్వారా బహిర్గతంగా ఎస్ఐఆర్ నిర్వహణ జరుగుతుందని చీకటి గదిలో కూర్చొని ఎస్ఐఆర్ నిర్వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బలంగా చెప్పాలని పార్టీలు ఆ దిశగా వాదించాలని సూచించారు అదేవిధంగా వాటర్ చేర్పుల్లో వయోజన చేర్పులు అనగా 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించే దిశగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలు కొనసాగుతున్న వేళ ఒక వార్డు లేదా గ్రామంలో 100 మంది ఓటర్లు నమోదు అయ్యే ప్రాంతంలో 130 మంది నమోదు కాకూడదని అదేవిధంగా 70 మంది గా కూడా చూపకూడదని అటువంటి దశలో ఎస్ ఐ ఆర్ కు సరైన నిర్వహణ ఉండదని పేర్కొన్నారు,త ప్పులు జరిగితే ఒకటి రెండు శాతం ఉంటే తప్పు లేదని 20 లేక 30 శాతం తప్పుడు నమోదు జరిగితే అది అక్కడ ప్రభుత్వంలో ఉన్నవారు చేస్తున్న ప్రక్రియ గా భావించవలసి ఉంటుందని అన్నారు అటువంటి అప్పుడు ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే కంటే ప్రభుత్వాలే ప్రజలను ఎన్నుకునే పరిస్థితి దాపురిస్తుందని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఘాటుగా విమర్శించారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ద్వారా కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా లేని ప్రజల ఓట్లను అన్యాయంగా తొలగిస్తున్నారని ఎస్సీ ఎస్టీ ట్రైబుల్ ప్రాంతాల ప్రజల తో పాటు మైనార్టీల ఓట్లను అడ్డగోలుగా తీసివేస్తున్నారని విమర్శించారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని లేక ప్రాంతీయ బేధాలతోనూ లేక కులాల ఆధారంగాను ఓట్ల తొలగింపు ప్రక్రియను నిర్వహిస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదని ప్రజలతో కలిసి గట్టిగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాని ప్రకారం నిర్వహణ జరగకుంటే అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అన్ని వార్డుల్లో ప్రజల ముందు గట్టిగా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు ఎవరైనా అన్యాయంగా ఓట్లు తొలగిస్తే వారితో కలిసి ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఎస్ఐఆర్ ప్రతులు ఆధారంగా నిర్వహణ జరిగిందో లేదో పరిశీలించి వారితో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తామని గట్టిగా చెప్పారు. అనంతరం సాయంత్రం ఆర్వి రామారావు చారిత్రాత్మక, భౌతిక వాదంపై సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ పాత్రికేయులు సమావేశం లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్,సిపిఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ,ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవాని,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు,కే రామాంజనేయులు, స్థానిక సిపిఐ నాయకులు వలం కొండ బ్రాహ్మం, పొన్నం నరసింహారావు,చూండూరు సుభారావు, పద్మాల వెంకటేశ్వర రావు,నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి అంబోజి శివాజీ మండల సీపీఐ కార్యదర్శి కనక పూడి. బాబురావు, చల్లా ల శివాజీ,గడ్డం శ్రీనివాసరరావు, తదితరులు పాల్గొన్నారు, ముందుగా ప్రజా నాట్య మండలి నాయకులు ఆర్ పిచ్చయ్య బృందం విప్లవ గేయాలతో ఈ శిబిరాన్ని అలరింప చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *