కందుకూరులో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం

సెక్టర్ సూపర్వైజర్ కే. రమణ

పయనించే సూర్యుడు. మే 30 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలంలోని కందుకూరు గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు సెక్టార్ సూపర్వైజర్ కే. రమణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి తల్లులను తమ యొక్క చిన్నారులను ఐదు సంవత్సరాలు వచ్చే వరకు అంగన్వాడి కేంద్రానికి పంపించాలని తెలియజేశారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో ఆటల పాటల ద్వారా ప్రీస్కూల్ న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘ బంధం అధ్యక్షురాలు పి. వెంకటమ్మ, బి.షాలిని అంగన్వాడి టీచర్లు ఐ ఎం విస్తర్, రాణి, యాదమ్మ మరియు తల్లులు కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *