కరాటేలో బంగారు, వెండి పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 3 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న తిరుపతిలో నిర్వహించిన 6వ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్ & నేషనల్ సెలక్షన్–2026 పోటీల్లో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విజేతలు ఈరోజు జగ్గయ్యపేటలోని తమ నివాసంలో శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. పోటీల్లో దైనిక ఒక బంగారు పతకం, ఒక వెండి పతకం, జితేంద్ర ఒక బంగారు పతకం, లోహిత ఒక బంగారు పతకం సాధించి జగ్గయ్యపేటకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని, జాతీయస్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, జగ్గయ్యపేటకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుతున్న వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ ఎరుగురాల పూజ ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, క్రమశిక్షణతో శిక్షణ అందిస్తున్న ఆమె సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అకాడమీ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *