కల్వకుర్తి- కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

పయనించే సూర్యుడు జూన్ 3( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో కల్వకుర్తి–కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిర్యాదుదారు చిట్టికొండ పద్మ భర్త చిట్టికొండ ఎల్లయ్య, కోడేరు గ్రామం మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె భర్త చిట్టికొండ ఎల్లయ్య తండ్రి దశరథ (35), కుమారుడు మల్లేష్ మరియు ఇతరులతో కలిసి టీజీ 06T3043 నంబరు గల డీసీఎం వాహనంలో గొర్రెలను తరలిస్తూ ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలియజేసినారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏపీ 29V3666 నంబరు గల డీసీఎం వాహనం వెనుక టైరు పంచర్ కావడంతో హైవేపై నిలిపి ఉంచి పంచర్ మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఆ పనులకు వెలుతురు కల్పించేందుకు ఏపీ 10W9197 నంబరు గల మరో డీసీఎం వాహనాన్ని కూడా వెనుక భాగంలో నిలిపి ఉంచినట్లు తెలిసింది. ఈ రెండు వాహనాలలో కూడా మేకలు, గొర్రెల లోడు ఉన్నది. ఇదే సమయంలో టీజీ 06T3043 నంబరు గల డీసీఎం వాహనం అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ప్రమాదంలో చిట్టికొండ ఎల్లయ్య తండ్రి దశరథ, వయస్సు 35 సంవత్సరాలు, కోడేరు గ్రామం,మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా ప్రమాదంలో సుమారు 200 మేకలు మరియు గొర్రెలు మృతి చెందినట్లు గుర్తించబడింది. మరికొన్ని మేకలు, గొర్రెలు గాయపడినట్లు తెలిసింది. చిట్టికొండ పద్మ మరియు ఆమె కుమారుడు మల్లేష్ గాయపడినారు. సమాచారం అందుకున్న వెంటనే డిండి పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతి చెందిన మేకలు మరియు గొర్రెలకు వెటర్నరీ వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై డిండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, సంబంధిత వాహనాల పాత్ర మరియు ఇతర అంశాలపై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *