కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు మే 30 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 67 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు కార్యక్రమంలో ఉట్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత జాదవ్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *