కామ్రేడ్ సుందరయ్య41 వ వర్ధంతి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అరకు నియోజకవర్గసభ్యులు గెమ్మెలి చిన్నబాబు.

పయనించే సూర్యుడు: మే: 20/26 అరకు లోయ టౌన్ రీపోర్టర్ అల్లూరి జిల్లా అరకు లోయమండల కేంద్రంలో సుంకర మెట్ట పంచాయతీ దాబుగుడ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. సుందరయ్య వర్ధంతి సందర్భంగా దాబుగుడ గ్రామస్తులకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి.అప్పలనరస పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజాలు ఆదివాసుల హక్కుల చట్టాలు నిర్వీర్యం కాకుండా నిరంతరం కృషి చేస్తున్న ఎర్రజెండా తోనే ఆదివాసులకు రక్షణ ఉంటుంది అని అన్నారు . ఆదివాసుల కు ఎర్రజెండా అవసరమని దాబుగుడ ఆదివాసి గిరిజనులు పార్టీ లో పనిచేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. సుందరయ్య సంపన కుటుంబానికి చెందిన వారు సుందరయ్య తన జీవితంలో బుడుగు బలహీన వర్గాల కోసం అంటరానితనం నిర్మూలనకు కోసం అందరికి కూడు, గూడు, బట్ట కావాలని మహిళలకు రక్షణ సమానత్వం స్వేచ్ఛ కావాలని నిరంతరం కృషి చేశారు. దున్నే వాడిదే భూమి అన్న నినాదంతో విరోచిత ఫోరాటలు నిర్వహించారు. సుందరయ్య ఆస్థి పేద ప్రజలకు పంచి పెట్టిన ఘనత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత సుందరయ్య ఉంది.స్వంత ప్రయోజనం కంటే ప్రజల ప్రయోజనాలే మిన్నాగ భావించి తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసారు. మనమంతా సుందరయ్య బాటలో ప్రయాణం చేస్తూ మన ప్రాంత అభివృద్ధికి కోసం ఆదివాసులు ఐక్యంగా ఎర్ర జెండా నీడలో భవిష్యత్తులో పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు పంచాయతీ నాయకులు చిట్టెం నాయక్ గురు మూర్తి, పాంగి. నాని బాబు, సి హెచ్ కెసిబో, కె.చిట్టిబాబు, దాబుగుడ గ్రామస్తులు కె.విజయ్, సన్యాసిరావు, బి.సుబ్బారావు .బి.సన్యసిరావు ,బి.ఆనంద్, కె.ఆనంద్ కుమార్, బి ప్రేమ్ కుమార్, బి.శ్రీను, బి.బాస్కరావు, డొంబు, బి.విజయలక్మి, కె.శివ, బి రమేష్, బి.రూబి, బి.బుజ్జిబాబు, కె.శిరిష బి.కాజల్ ,బి.నందిని, బి.శాల్మి, బి.పూల్మ్,బి. లక్ష్మి, బి.లక్ష్మి, బి.లింగో, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *