కూలీలకు మజ్జిగ మంచినీరు ప్యాకెట్ల పంపిణీ

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ మే 24/26 జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని) పనులను ఏ.పీ.ఓ మరియు గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూలీలకు చల్లటి మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు వినోభానగర్ నుండి ఉపాధి పనులకు ప్రతిరోజూ సుమారు 130 మంది కూలీలు హాజరవుతున్నారని వారు ఎండ దెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏ.పీ.ఓ మరియు సర్పంచ్ ఈ సందర్భంగా సూచించారు ఈ మండుటెండల్లో తమ దాహార్తిని తీర్చడానికి గ్రామ పంచాయతీ తరపున సకాలంలో స్పందించి ఈ సదుపాయం కల్పించడం పట్ల ఉపాధి హామీ కూలీలు సర్పంచ్ కి మరియు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *