పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 13 గూడూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ ని ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ ఆధ్వర్యంలో గూడూరులో నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దె నెక్కి రెండేళ్లు అయిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ ప్లాప్ చేశారని మురళీధర్ విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండిపడ్డారు.