ఘణజీవామృతం ఉండగా డి ఎ పి దండగ

పయనించే సూర్యుడు మే 20 బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓ జయ ప్రసాద్ బి మఠం మండల పరిధిలోని రేఖలకుంట్ల యూనిట్ జెడ్ కొత్తపల్లె లో మంగళవారం పకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకి ఘనజీవామృతం విత్తన గుళికలు సీడ్ ఫెల్ట్రాజేషన్ తయారు చేశి చూపించడం జరిగినది ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్ వీరనారాయణ హాజరై వారు మాట్లాడుతూ ఘనజీవామృతం భూమిలో వేయడం వల్ల మంచి పోషకాలు మొక్కకు అందించడమే కాకుండా మంచి దిగుబడి కూడా వస్తుందని అలాగే ఏ విత్తనాలైనా భూమిలో డైరెక్టుగా చల్లకుండా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి భూమిలో వెదచ ల్లినట్లయితే భూమి నుంచి వచ్చే తెగుళ్లను అరికడుతుందని అలాగే విత్తనం కూడా బాగా మొలక రావటానికి సహాయపడుతుందని విత్తనంపై ఉన్న సూక్ష్మ జీవులను చీడ పీడ లను రానివ్వకుండా అరికడుతుందని నీటి వసతి లేని భూముల్లో విత్తన గుళికలను చేసి భూమిలో వెదజల్లినట్లు అయితే వర్షాలు వచ్చి నప్పుడు అవి మొలకలు వస్తాయని అంతవరకు పక్షులు కూడా గింజలను నష్టపరచకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జిలు జయ ప్రసాద్ గోపాలమ్మ సబల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేష్ రెండు యూనిట్ల ఐ సి ఆర్ పి లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *