ఘనంగా నన్నక రుహిక పుష్పాలంకరణ వేడుక

పయనించే సూర్యుడు జూన్ 05, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని :తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నన్నక గోపాలరావు, వెంకట నరసమ్మల మనవరాలు, నన్నక శ్రీనివాసరావు – ఉషా దంపతుల ఏకైక కుమార్తె రుహిక పుష్పాలంకరణ వేడుక గురువారం కోదుమూరులోని జ్యోతి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారి రుహికకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య వైభవంగా సాగింది. ఈ వేడుకలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, బీజేపీ నాయకులు తాటికొండ రామకృష్ణ, సీపీఎం నాయకులు నన్నక కృష్ణమూర్తి, బండ్లమూడి వెంకటేశ్వర్లు, ఆలస్యం నాగేశ్వరరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, పద్మ, నన్నక నాగేశ్వరరావు, లక్ష్మి తదితరులు పాల్గొని రుహికకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికి, విందు ఏర్పాటు చేశారు. వేడుక ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *