పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 26.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// గతాన్ని విస్మరిస్తే… భవిష్యత్తు శూన్యం! ఈరోజు మనం కోట్లు సంపాదిస్తున్నా, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా, రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నా, సమాజంలో తల ఎత్తుకుని తిరుగుతున్నా… దీని వెనుక ఒక సుదీర్ఘమైన పోరాటం ఉంది. మన ముత్తాతలు, తాతలు పడిన అవమానాలను తుడిచిపెట్టడానికి కొందరు మహానుభావులు తమ జీవితాలనే త్యాగం చేశారు! భగవాన్ బుద్ధుడు ప్రసాదించిన సమతా మార్గం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే అందించిన అక్షర ఆయుధం ఛత్రపతి సాహూ మహారాజ్ తెచ్చిన సామాజిక సంస్కరణలు. విశ్వరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ కలం నుండి జాలువారిన “భారత రాజ్యాంగం”… వీటి ఫలితమే నేటి ఎస్ సి బిసి ఎస్ టి మైనారిటీల మరియు మహిళల ఆత్మగౌరవ జీవితం! కానీ ఈరోజు మన పరిస్థితి ఏమిటి? సౌకర్యాలు రాగానే మూలాలను మర్చిపోతున్నాం. కుర్చీ దక్కగానే, ఆ కుర్చీని ప్రసాదించిన ‘రాజ్యాంగ నిర్మాత’ను విస్మరిస్తున్నాం. కృతజ్ఞత లేని సమాజం ఎక్కువ కాలం స్వేచ్ఛగా బతకలేదు! చరిత్రను మరిచిపోయినవాడు చరిత్రను సృష్టించలేడు. బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్ ఇప్పుడైనా మేల్కొందాం: (1). మన పిల్లలకు మన పూర్వీకుల పోరాట చరిత్రను నేర్పుదాం. (2). నాడు మహానుభావులు త్యాగం చేస్తే… నేడు మనం కనీసం “కృతజ్ఞత” కలిగి ఉందాం. (3). హక్కులను వాడుకుంటూనే, సామాజిక బాధ్యతను గుర్తుంచుకుందాం. మీ చదువు, ఉద్యోగం, వ్యాపారం కేవలం మీ కుటుంబం కోసమే కాదు… మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన సమాజం కోసం కూడా! శ్రమిద్దా0 జై భీమ్ జై పూలే