పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్లలో నిర్వహించనున్న మహా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఫరూఖ్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ నెల 5వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవాలని తెలిపారు. అనంతరం జడ్చర్ల–కల్వకుర్తి రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా ప్రాంగణానికి తరలివెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. ఫరూఖ్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని రాయికల్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా గ్రామ గ్రామం నుంచి జనసంద్రంలా తరలివచ్చి జడ్చర్ల సభను చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు..