జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి పాఠశాలలో బడిబాట కార్యక్రమం.

పయనించే సూర్యుడు జూన్ :12 హుజురాబాద్ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : జమ్మికుంట మండలంలోని కొరపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు గురువారం రోజున బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయ బృందం రెండు విభాగాలుగా విడిపోయి ఒక విభాగం వారు విలాసాగర్ గ్రామంలో మరియు మరొక విభాగం వారు సైదాబాద్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బడి ఈడు వయసున్న పిల్లలందరినీ జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ మరియు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని మరియు ఉచిత మధ్యాహ్న భోజనము ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత నోటు పుస్తకాలు ఉచితంగా అమ్మాయిలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కరాటే శిక్షణ ఆటలలో శిక్షణ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఉచితంగా అందుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పి. రాజయ్య, పెండెం శ్రీనివాస్ ,ఆవాల నరహరి, పి.రాజు, సి. రవి కాంత్ రాజు, విజేందర్ రెడ్డి మరియు క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *