పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మే.22.2026 రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామపంచాయతీ గోపవరం,నూనెపల్లి,ఎమ్.బూరుగుబంధ గ్రామాలలో జన్ భగీదరి”(ప్రజా భాగస్వామ్యం)”అభియాన్ కార్యక్రమలలో పాల్గొన్న.గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి లక్ష్మరావు ముసురుమిల్లి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీటీసీ కుంజం వంశీ ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రవేశపెడుతున్న.ప్రతి పథకం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని,ప్రజల భాగస్వామితోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే పధకాలను వివరించారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అభ హెల్త్ కార్డులు వలన 5 లక్షల వరుకు ఆరోగ్య పరిమితి పొద్దావచ్చని,ఎండలు ఉష్ణోగ్రత పెరిగింది.కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలల్ని,అంతే కాకుండా ప్రధానమంత్రి సడక్ యోజనలో భాగంగా పలు రోడ్డులు మధ్యలోనే ఆగిపోయి ఉన్నవని.వాటిని ఉన్నత స్థాయి అధికారులలో పెట్టాలని, ఎమ్.బూరుగుబంధ గ్రామంలో ఆరో వాటర్ ప్లాంట్ పడిపోయా ఉందని.తామరపల్లి గ్రామపంచాయతీ వారు ఒక నెల రోజులలో చేస్తాం అని తెలిపియున్నారు.ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవడం,స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొనడంపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.అనంతరం గ్రామస్తులకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్, పి.హెచ్.ఎన్ ఈశ్వరమ్మ,మాజీ ఉప సర్పంచ్ చోడి వెంకన్న,ఏం.ఎల్.హెచ్ పి.బుల్లియమ్మ,సచివాలయం సిబ్బంది,డ్వాక్రా వి.వో.ఏ లు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.