జర్నలిస్ట్ కూతురి చదువు కోసం ఆర్థిక సహాయం

పయనించే సూర్యుడు జూన్ 5 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రామస్వామి కూతురు హైదరాబాదులో ఏజీబీఎస్సీ చదువుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజు,మెస్ బిల్లు చెల్లించలేనన్న విషయం తెలపడంతో ఐజేయు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నేషనల్ కౌన్సిల్ సభ్యులు గోలి సుదర్శన్ రెడ్డి 10వేలు ,మరో జర్నలిస్టు ఐజేయూ సభ్యుడు 5వేల రూపాయలు మొత్తం 15 వేల రూపాయలను రామస్వామికి గురువారం నాగర్ కర్నూల్ లో అందజేయడం జరిగింది . గతంలో క్లాస్మేట్ క్లబ్ తరఫున కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్ , జిల్లా కౌన్సిల్ సభ్యులు రమణ కుమార్, జయ ప్రసాద్, పాలాది యాదయ్య,సీనియర్ నాయకులు కొండకింది మాధవరెడ్డి, నాగర్ కర్నూల్ తాలూకా ఉపాధ్యక్షులు జంగిటి రాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *