జహీరాబాద్‌లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు: నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం

పయనించే సూర్యుడు, జూలై 7 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మరియు నవభారత నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై నరోత్తం మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం మరియు వారి ఆర్థిక సామాజిక అభ్యున్నతి కోసం అలాగే సామాజిక సమానత్వం కోసం అలుపెరగకుండా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశ ప్రగతికి మరియు నిరుపేదల సాధికారతకు ఆయన చేసిన సేవలు చరిత్రాత్మకమని ఆయన జీవితాంతం చూపిన మార్గం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, ఎం మల్లేశం, హాసన్ పర్వానా, చెంగల్ జైపాల్, జైరాజ్, అబ్రహం మాదిగ, ధన్ రాజ్, ఉల్లాసం, చిన్న, మోహన్, నిర్మల్, మైకేల్, పవన్ రాథోడ్, కె మల్లేశం మరియు దళిత సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *