పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస ఆర్ డి ఓ కార్యాలయంలో టిడ్కో గృహాల నిర్మాణానికి భూములు ఇచ్చిన 9 మంది రైతులకు రూ.1,15,86,973/- నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని, లబ్ధిదారులైన రైతులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నష్టపరిహారం సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతుల సహకారంతోనే టిడ్కో గృహాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, టిడ్కో అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులైన రైతులు పాల్గొన్నారు.