డ్యాగ అనిల్ కుమార్ హెచ్చరిక: ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్

పయనించే సూర్యుడు జులై 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ అచ్చంపేట, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం అచ్చంపేటలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగ అనిల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా వేలాది మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ప్రజాపతి, గుద్దటి ఆంజనేయులు, రాజు యాదవ్, సాయి కుమార్, ప్రశాంత్, మమత, గాయత్రి, అనురాధ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *